ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavita went to Delhi. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నుంచి నోటీసులు అందాయి.

By Medi Samrat  Published on  8 March 2023 6:03 PM IST
ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavita


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నుంచి నోటీసులు అందాయి. ఫిబ్రవరి-9న రావాలని నోటీసులో ఈడీ పేర్కొనగా.. 15న వస్తానని అధికారులకు కవిత లేఖ రాశారు. కవిత రెక్వెస్ట్‌పై ఈడీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఈడీకి లేఖ రాసి గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే కవిత ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆమె.. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అవ్వాలని భావించారు. సమయం లేకపోవడంతో కవితకు ఫోన్‌ చేసిన కేసీఆర్.. సుమారు 15 నిమిషాలపాటు ఈడీ నోటీసులు, న్యాయ సలహాలపై చర్చించాక కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియా సంస్థలు చెబుతున్నాయి.

ఈ నెల 9న ఢిల్లీకి రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు రావడంపై కవిత స్పందించారు. తనకు ఈడీ నుండి నోటీసులు వచ్చాయని.. ముందస్తు అపాయింట్ మెంట్లు ఉండడంతో ఈడీ నోటీసులపై ఎలా స్పందించాలనే విషయంపై న్యాయ సలహా తీసుకోనున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును వెంటనే పాస్ చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలో ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టామని ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని కవిత చెప్పారు.



Next Story