సీబీఐ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్తో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని లేఖలో కోరారు. అలాగే సంబంధిత అనుబంధ కాపీలను ఇవ్వాలన్నారు. డాక్యుమెంట్లను సాధ్యమైనంత త్వరగా పంపించాలని లేఖలో కవిత కోరారు. తన వివరణకు ముందే ఈ డాక్యుమెంట్లను పంపించినట్టయిటే.. వివరణ ఇచ్చేందుకు ఈజీ అవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్ కుమార్, కవితకు నోటీసులు జారీ చేశారు. 6వ తేదీన విచారిస్తామని అందులో పేర్కొన్నారు.