VIDEO: కేసీఆర్‌ను హగ్‌ చేసుకున్న కవిత.. భావోద్వేగంతో..

రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు.

By అంజి  Published on  29 Aug 2024 2:02 PM IST
MLC Kavitha, KCR, Telangana, Erravalli, BRS

VIDEO: కేసీఆర్‌ను హగ్‌ చేసుకున్న కవిత.. భావోద్వేగంతో..

రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఇవాళ హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆమె తండ్రిని కలవగానే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

కవితను చూడగానే కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కవితకు కేసీఆర్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. అంతకుముందు కవితకు ఎర్రవెల్లి గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. 10 రోజుల పాటు కేసీఆర్‌తోనే ఆమె ఉంటారని సమాచారం. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవిత.. బెయిల్‌పై రెండు రోజుల క్రితం విడుదలయ్యారు.

Next Story