బీజేపీ మిత్ర పక్షం అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాపాడేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కల్గుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఎలా బీజేపీ కి కొమ్ముకాసిందో చూశామని.. అందుకు ప్రతిఫలంగా కేసిఆర్ ను కాపాడాలని బీజేపీ చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదికలు తీసుకుంటుంది. కాళేశ్వరం మీద జ్యుడీషియల్ కమిటీ వేసి.. విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఈడీ, ఐటీ, సీబీఐలతో కేసులు పెట్టు వేధించి.. పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కాపాడటం ఎవరి తరం కాదన్నారు. బీ ఎల్ సంతోష్ ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఇరికించారు అని చెబుతున్నారు కదా ఎందుకు నిరూపించలేక పోయారు. బీజేపీ చిత్తశుద్ధి అర్ధం అవుతుందన్నారు. BRS ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారు. బీజేపీ, BRS డ్రామాలు ఇప్పటికైనా అపాలన్నారు.