ఆ అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంద‌నే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు

పదేండ్లు యువత జీవితాలతో బీఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  18 Jun 2024 9:30 AM GMT
ఆ అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంద‌నే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు

పదేండ్లు యువత జీవితాలతో బీఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్‌ పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌ పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదన్నారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదన్నారు. ఆరు నెలలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని తెలిపారు.

కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై 40,000 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. కమిషన్ ల కోసం కక్కుర్తి పడి ఎక్కువ పైసలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భారం అవుతుందని అప్పుడే చెప్పాము.. అప్పటి ప్రభుత్వం వినలేదు. బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంట్ లు పెట్టాలి కానీ దామర చర్లలో ఎందుకు పవర్ ప్లాంట్ పెట్టారని ప్ర‌శ్నించారు. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది.. అందుకే హరీష్ రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోనెట్టి ఇప్పుడు పనులు చేయండి చెయ్యండి అంటే ఎట్లా.. హామీలు అమలు చేస్తాము.. 5 ఏండ్ల సమయం ఉందన్నారు.

Next Story