అంబానీ, ఆదానీ కోసమే వికసిత్ భారత్ : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిప‌డ్డారు.

By Medi Samrat  Published on  27 Feb 2024 3:20 PM IST
అంబానీ, ఆదానీ కోసమే వికసిత్ భారత్ : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిప‌డ్డారు. రాముడికి మోదీకి ఎటువంటి సంబంధం ఉందని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.. వికసిత్ భారత్ అనేది పెట్టుబడి దారులకు మాత్రమే.. అంబానీ, ఆదానీ కోసమే వికసిత్ భారత్ అని ఆరోపించారు. వికసిత్ భారత్ అంటే పెట్టుబడి వర్గాలకు కొమ్ము కాయడం కాదు అని మండిప‌ట్టారు.

రైతుల సంక్షేమ కోసం పని చేసే వారు అయితే.. రైతులకు రుణ మాఫీ చేస్తే రైతులు సోమరిపోతులు అవుతారు అంటున్నారు.. అంబానీ, ఆదానీ లోన్ లు రుణ మాఫీ చేస్తున్నారు. పెట్టుబడి దారులకు ఒక న్యాయం.. సామాన్యుల‌కు ఒక న్యాయమా అని ప్ర‌శ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశం వెలుగుతుంది అని వికసిత్ భారత్ పేరుతో ప్రజలను, మహిళలను బాధ పెట్టడమా అని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను గౌరవిస్తుంది. రాముడితో, దేవుడితో మోదీ పోల్చుకోవడం ఏంటి.? అని ప్ర‌శ్నించారు. గుడిలో రాముడిని పూజించడం కాదు.. మోదీని గుడిలో పూజించాలి అనేది వాళ్ల‌ సిద్ధాంతం అన్నారు.

Next Story