కేటీఆర్‌కు హైదరాబాద్‌పై ఒక స్పష్టత లేదు : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్‌లాగా గుర్తింపు పొందారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు..

By Medi Samrat  Published on  9 Jan 2025 2:32 PM IST
కేటీఆర్‌కు హైదరాబాద్‌పై ఒక స్పష్టత లేదు : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్‌లాగా గుర్తింపు పొందారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు.. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించలేదని.. మతిస్థిమితం కోల్పోయి కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్‌కు హైదరాబాద్‌పై ఒక స్పష్టత లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో బావ, బామ్మర్ది ఎన్నో స్కామ్‌ల‌కు పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకుతిన్నారని మండిప‌డ్డారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా.. లిక్కర్ స్కామ్‌లో చెల్లె కవిత ఇరుక్కుని ఊసలు లెక్క పెట్టింది నిజం కాదా.. అని ప్ర‌శ్నించారు.

చత్తీస్‌ఘ‌డ్ లో అదానీతో కేసీఆర్ చేసుకున్న అక్రమ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల సంగతేంటి అని ప్ర‌శ్నించారు. ఫోన్ టాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపింది కేటీఆరే అన్నారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఐటీ రంగంలో హైదరాబాదును అభివృద్ధి చేశామని ఒక బోగస్ ప్రచారానికి కేటీఆర్ తెరలేపార‌న్నారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామ‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకువచ్చిన స్కామ్ కు దారి తీసిందన్నారు. దోపిడీకి పాల్పడిన కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు. ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్‌కు సూచ‌న చేశారు.

Next Story