'పుష్ప' ఐటం సాంగ్‌: దేవి శ్రీ ప్రసాద్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్‌

MLA Raja singh demand apology from DSP for comments on bhakti songs. సమంత చేసిన ఈ ఐటం సాంగ్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటం సాంగ్స్, దేవుళ్ల పాటలు ఒక్కటే అని

By అంజి  Published on  18 Dec 2021 8:04 AM GMT
పుష్ప ఐటం సాంగ్‌: దేవి శ్రీ ప్రసాద్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్‌

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా 'పుష్ప' థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఈ సినిమాలో ఐటం సాంగ్‌ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పై రచ్చ జరుగుతోంది. సమంత చేసిన ఈ ఐటం సాంగ్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటం సాంగ్స్, దేవుళ్ల పాటలు ఒక్కటే అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ ఖండించారు. హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి మూవీ తీయాలని, దాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసుకోవాలి అంతే కానీ.. హిందూ దేవుళ్ల పూజలను ఐటం సాంగ్స్‌ పోలిస్తే బాగోదని హెచ్చరించారు.

అల్లు అర్జున్‌ సినిమాలను తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. అలాంటి అర్జున్‌ సినిమాలోని సాంగ్‌ను దేవుళ్ల పూజలతో పోల్చడం సరికాదని అన్నారు. యావత్‌ హిందూ సమాజానికి దేవి శ్రీప్రసాద్‌ క్షమాపణ చెప్పాలని.. చెప్పకపోతే తెలంగాణ ప్రజలు తరిమికొడతారని అన్నారు. దేవీ శ్రీప్రసాద్‌ అనవసరంగా హిందువుల జోలికి వస్తున్నారని, ఐటం సాంగ్‌ను దేవుళ్ల పూజతో పోల్చి తప్పు చేశారని అన్నారు. క్షమాపణ చెప్పాలని తాను మర్యాదపూర్వకంగా అడుగుతున్నానని అన్నారు.

Next Story
Share it