టీఆర్ఎస్‌కు గ‌ట్టి షాకిచ్చిన ఎమ్మెల్యే రఘునందన్

MLA Raghunandhan Shock To TRS. కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట కేంద్రంలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్‌ కు పెద్ద‌

By Medi Samrat  Published on  13 July 2021 2:45 PM IST
టీఆర్ఎస్‌కు గ‌ట్టి షాకిచ్చిన ఎమ్మెల్యే రఘునందన్

కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట కేంద్రంలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్‌ కు గ‌ట్టి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక మున్సిపాలిటీలోని ముగ్గురు సిట్టింగ్ టీఆర్ఎస్‌ కౌన్సిలర్లను బీజేపీలో చేర్చి అధికార పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మేర‌కు ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో నేడు బీజేపీలో చేరారు. బండి సంజ‌య్ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాకలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని.. టీఆర్ఎస్ దుబ్బాకను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ టీఆర్ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకనే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందని.. దుబ్బాక ద్వారా దానికి నాంది పడిందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు విజ‌య‌శాంతి, డీకే అరుణ‌, జాతీయ ఓబీసీ మోర్చా అధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్‌, ఈటెల రాజేంద‌ర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, అశ్వ‌త్థామ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.





Next Story