నడ్డా, అమిత్ షాలను కించపరచలేదు : ఎమ్మెల్యే రఘునందనరావు
MLA Raghunandan Rao Responds On Romours. నేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలను కించపరచలేదని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు.
By Medi Samrat Published on 3 July 2023 8:49 PM ISTనేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలను కించపరచలేదని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. మీడియాతో సరదాగా మాట్లాడిన విషయాలను తప్పుగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని.. నేను అనని మాటలు అన్నాను అని వార్తలు వచ్చాయని స్పష్టత ఇచ్చారు. తాను కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి నియోజకవర్గం సమస్యలపై మాట్లాడానన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రూ.120 కోట్లతో నా నియోజకవర్గంలో సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద నిధులు ఇవ్వాలని కోరానని వివరించారు.
పదేళ్లుగా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తున్న వ్యక్తిని నేను.. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని నేను.. అధికారికంగా, అనధికారికంగా పార్టీ కోసం పని చేశానని వెల్లడించారు. పార్టీలో పదవులు ఆశించడంలో తప్పులేదని అన్నారు. అధ్యక్ష మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. నాయకత్వం మార్పు నా పరిధిలోని అంశం కాదు.. దానిపై నేను ఏమి మాట్లాడలేదని అన్నారు. పదవుల రేసులో నేను లేనంటే నా సేవలను పార్టీ ఇంకో రకంగా వాడుకోవాలని అనుకుంటుందేమోనని అధిష్టానంపై విశ్వాసం వ్యక్తం చేశారు
రాహుల్ గాంధీ యూనిఫాం సివిల్ కోడ్ పై తన అభిప్రాయం చెప్తే బాగుంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందని చెప్పడం సత్యదూరం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయన్నారు. అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో ఏం మాట్లాడారో చెప్పాలన్నారు.
రెండు నెలల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే.. బీజేపీకి పరిస్థితులు స్థానూకులంగా ఉంటాయని మాత్రమే చెప్పానని అన్నారు. బీజేపీలో పదవులు ఇవ్వకపోయినా సామాన్య కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పనిచేస్తానన్నారు. ప్రజలు ఇచ్చిన పదవి నాకుంది. రఘునందన్ రావు రెండోసారి బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుస్తాడని.. రఘునందన్ రావు, కమలం గుర్తు వేరువేరు కాదు, వేరుగా చూడొద్దని అన్నారు. రఘునందన్ రావు మొఖం చూసి, బీజేపీ గుర్తు చూసి ప్రజలు గెలిపించారని.. నాయకత్వం మార్పుకు సంబంధించి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.