తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శుక్రవారం సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గంకు సంబంధించి పలు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు.
అయితే శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఉద్యమం నుండి పార్టీలో పనిచేసిన తమకు చెడ్డ పేరు వస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం క్యాడర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. తొందరపడి పార్టీని వీడనని.. టీఆర్ఎస్ క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని.. టీఆర్ఎస్ మాకు న్యాయం చేసింది. అన్యాయంగా పార్టీని వీడమని తెలిపారు. అయితే.. మరోమారు కార్యకర్తలు, క్యాడర్, ప్రజలతోపాటు సీఎంతో కూడా సమావేశమవుతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు