నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

By Medi Samrat  Published on  5 Sept 2024 5:35 PM IST
నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని.. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని.. అదీ ఏకకాలంలో జరగలేదని కరీంనగర్‌లో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక మరిచిపోయారన్నారు. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్ పెంపుపై తాము ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోందని విమర్శించారు. అధికారుల కోసం తాను ఓ 'బ్లాక్ బుక్‌'ను రెడీ చేశానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు.

Next Story