మమ్మల్ని బెదిరించే వారిపై ఎంతకైనా తెగిస్తాం : ఎమ్మెల్యే గువ్వల

MLA Guvvala Balaraju Fire On BJP. మమ్మల్ని ఎవరూ నిర్బంధించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు.

By Medi Samrat
Published on : 15 Nov 2022 7:49 PM IST

మమ్మల్ని బెదిరించే వారిపై ఎంతకైనా తెగిస్తాం : ఎమ్మెల్యే గువ్వల

మమ్మల్ని ఎవరూ నిర్బంధించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రక్షణ కోసమే కేసీఆర్ మమ్మల్ని ప్రగతి భవన్ లో ఉండమన్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే రక్షణలో ఉన్నాం.. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే వారదులుగా మేము ఉన్నామని గువ్వల అన్నారు.

సీఎంకు అందుబాటులో ఉండటానికే అక్కడ ఉన్నాము. మేము ప్రజలకు అందుబాటులోనే ఉన్నాము.. మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎవరిని వదిలిపెట్టం.. వారికి బుద్ది చెబుతాం.. మా మీద వాడే సంస్థలతోనే వారిని అంతం చేస్తాం అని హెచ్చ‌రించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని దోషిగా నిలబెడతామన్నారు. కేసీఆర్ వదిలిన బాణం గా పనిచేస్తాం.. మమ్మల్ని బెదిరించే వారిపై ఎంతకైనా తెగిస్తాం హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.


Next Story