బీఆర్ఎస్‌ వాళ్ళు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలే : మంత్రి ఉత్తమ్

రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విసిట్ చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  19 Jan 2024 8:15 PM IST
బీఆర్ఎస్‌ వాళ్ళు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలే : మంత్రి ఉత్తమ్

రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విసిట్ చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష జ‌రిగింది. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. మంత్రుల బృందం ఫీల్డ్ విసిట్ చేస్తాము. రోజు రోజుకు బయట పడుతున్న వివరాలను చూసి దిగ్ర్భాంతి చెందుతున్నామ‌న్నారు. కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం వీటి పై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పదేళ్ల BRS పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క తెలంగాణకు తీసుకురాలేదన్నారు. పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్ లో జాతీయ హోదా కోసం అప్లై చెయ్యలేదన్నారు.

జాతీయ హోదా స్టేటస్ అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదు అని గజేంద్ర సింగ్ శాఖావత్ మాతో చెప్పారని వివ‌రించారు. నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ చేయడం లేదు అని గత ప్రభుత్వానికి చెప్పినం అన్నారు. KRMB కి ప్రాజెక్టులు అప్పగించడానికి మా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల పై కేంద్రం చర్చలు జరిపింది. మేము సమాధానం చెప్పలేదని తెలిపారు.

BRS వాళ్ళు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలేన‌న్నారు. హరీష్ రావు స్టేట్మెంట్ లో నిజం లేదన్నారు. కృష్ణా వాటర్ గురించి BRS వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణా వాటర్ వాట తగ్గింది BRS హయంలోనేన‌న్నారు. రాష్ట్ర అమూల్యమైన సంపద BRS పాలన వ‌ల‌న‌ వృధా అయిందన్నారు. 18వేల కోట్లు ఇంట్రెస్ట్ లు, 9 వేల కోట్లు అన్‌పెయిడ్ బిల్స్‌ ఇరిగేషన్ లో భారం పెట్టారని.. ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ళ కోసం కాదని అన్నారు. KRMB విషయంలో అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని అధికారుల పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Next Story