పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. గుంపుల, అడవి సోమనిపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. వీటిని నాసిరకంగా, నాణ్యతలేమితో నిర్మించినా లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ విషయాన్ని మా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని.. విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కావాలని రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఊపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు.