ఈ రోజు ఒక చరిత్రత్మాకమైన రోజు.. దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినా వాస్తవ రూపం దక్కలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో వర్గీకరణ చేశామని.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇంత చరిత్రాత్మాకమైన నిర్ణయం తీసుకోవడంలో నేను ఉండడం అదృష్టం అన్నారు. నేను ఎమ్మెల్యే అయినప్పటినుండి ప్రతి శాసనసభలో, పార్లమెంట్‌లో ఎప్పీ వర్గీకరణ జరగాలని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడేవి.. కానీ ఈ రోజు ఒక పకడ్భంందీ ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు.