రైతులకు మంత్రి గుడ్‌న్యూస్‌.. జనవరి మాసాంతానికి పూర్తిస్థాయి రుణమాఫీ

హైదరాబాద్-కోదాడ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరిస్తామ‌ని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  25 Nov 2024 8:15 AM IST
రైతులకు మంత్రి గుడ్‌న్యూస్‌.. జనవరి మాసాంతానికి పూర్తిస్థాయి రుణమాఫీ

హైదరాబాద్-కోదాడ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరిస్తామ‌ని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద భూములకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి లలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాలలు నిర్మిస్తామ‌ని.. ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఓసిలలో పేద విద్యార్థులకు ఇందులో అవకాశం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. ఒక్కో పాఠశాల ఏర్పాటుకు రూ.300 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామ‌న్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుండే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టామ‌న్నారు.

మహిళామణులకు ఉచిత బస్ ప్రయాణం నుండే హామీల అమలు స్టార్ట్ అయ్యింద‌న్నారు. గృహజ్యోతి పధకంలో భాగం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుచేస్తున్నామ‌న్నారు. యావత్ భారతదేశంలొనే రుణమాఫీ చరిత్ర సృష్టించింది.. జనవరి మాసాంతానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామ‌ని చెప్పారు. 50 వేల ఉద్యోగ నియామకాలు చేప‌ట్టాం.. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు జారీ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌న్నారు.

త్వరలో హుజుర్నగర్,కోదాడలకు రైల్వే లైన్లు వ‌స్తాయ‌న్నారు. మూసీ ప్రక్షాళ‌నతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయకట్టు పెరగడంతో పాటు జిల్లాకు సురక్షితమైన త్రాగు నీరు వ‌స్తుంద‌న్నారు. దాన్యం దిగుబడిలో తెలంగాణా రికార్డ్ సృష్టించింద‌న్నారు.. యావత్ భారతదేశంలొనే ఇది రికార్డ్.. 66.7 లక్షల ఎకరాల్లో 40 లక్షల రైతాంగం సాధించిన ఘనత అన్నారు. జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు ఉంటాయ‌న్నారు. రైతులెవరు తొందర పడొద్దన్నారు. గ్రామంలోని చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.

నీటిపారుదల శాఖను బీఆర్ఎస్‌ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందన్నారు. లక్షా 80 వేలు ఖర్చు చేసిన నాటి ప్రభుత్వం ఒక్క ఎకరా కొత్త ఆయకట్టు సృష్టించలేక పోయిందన్నారు. సీతారామ‌ ప్రాజెక్ట్ ది అదే దుస్థితి.. ఆ ప్రాజెక్ట్ మీద ఖర్చు అయితే పెట్టారు కానీ ఎకరాకు నీళ్లు అందించలేక పోయారు.. పెండింగ్ లో ప్రాజెక్ట్ లు ఉన్నా కాలువలు దెబ్బతిన్నా సత్వరం మరమ్మతులు నిర్వహిస్తామ‌న్నారు.

హుజుర్ న‌గర్,కోదాడలలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం లిఫ్ట్ లను నిర్లక్ష్యం చేసిందన్నారు. నీటి లభ్యత ఉన్న చోట్ల లిఫ్ట్ ల ఏర్పాటు చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో నిన్నటి ప్రభుత్వం మోసం చేసింది.. పదేళ్ళలో పట్టుమని పదివేల ఉద్యోగాలు నియమించలేక పోయారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలలోనే 50 వేల ఉద్యోగాలు నియమించామ‌న్నారు. డిసెంబర్ 7 నుండే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. యావత్ తెలంగాణా సమాజం అభీష్టానికి అనుగుణంగా ప్రజాపాలన ఆవిష్కృతమైందన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

Next Story