ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసింది : మంత్రి ఉత్తమ్
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం ఆన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 13 Aug 2024 1:30 PM GMTఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం ఆన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలసౌధలో ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును 2026లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని విమర్శించారు. మాకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ సిస్టంను గాడిలో పెడుతున్నామన్నారు. పదేళ్ళలో 1.81 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు ఖర్చు పెట్టి నీరు ఇవ్వలేకపోయారు. పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదన్నారు.
సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాంలో రాజీవ్ సాగర్ ,ఇంధిరా సాగర్ ల నిర్మాణం చేపట్టాం.. కానీ కాంగ్రెస్ కు పేరు వస్తుందని రాజీవ్, ఇంధిరా సాగర్ లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బీఆర్ఎస్ నామకరణం చేసింది. రాజీవ్, ఇంధిరా సారగ్ లు రూ.3,500 కోట్లతో పూర్తయ్యేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని 18 వేల కోట్లకు పెంచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా.. ఆయకట్టు పెరగలేదన్నారు.
రాజీవ్, ఇంధిరా సాగర్ లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రీ డిజైనింగ్ పేరు తో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగిందన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ హాయాంలో కేవలం 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ పర్మిషన్ మేమే తీసుకొచ్చామని హరీష్ రావు చెప్తున్నారు.. కానీ ఇంతవరకూ సీడబ్ల్యూసీ పర్మిషన్ రాలేదన్నారు.