కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు : మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  28 Feb 2024 8:38 PM IST
కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు : మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జ‌ల‌సౌద‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1లక్షా 47వేల కోట్లు కావాలన్నారు. కాళేశ్వరంలో 25 వేల కోట్ల పనులు ఎలాంటి DPR లేకుండా అలాట్ చేశారని.. 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేశార‌ని వెల్ల‌డించారు. 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. ఇరిగేషన్ కోసం ఉపయోగించింది 65 టీఎంసీలు మాత్రమే. ప్రతీ ఏటా కాళేశ్వరం నుంచి 6 లక్షల 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. BRS తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మకులు చేస్తున్నారని అన్నారు.

BRS నేతలు మేడిగడ్డ పై నిజాలు చెప్పకుండా.. తప్పులు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. BRS నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ పూర్తిగా కొల్యాప్స్ అయ్యింద‌న్నారు. BRS ఉచిత సలహాలు ఇవ్వడం హ‌స్యాస్పదంగా ఉందన్నారు. మేడిగడ్డను NDSA కు అప్పగించామన్నారు. NDSA నివేదిక ఆధారంగా భవిషత్ చర్యలు ఉంటాయన్నారు. BRS లెక్క కాళేశ్వరం ప్రాజెక్టును నిషేధిత ప్రాంతంగా మేము పెట్టలేదన్నారు.

BRS నేతలతో పాటు కేసీఆర్ వెళ్లి చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలన్నారు. BRS నేతలకు కాళేశ్వరం చూపించాలని అధికారులకు మేము ఆదేశించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లెక్క ఇంతటి కరప్షన్, నిర్లక్ష్యం జరగలేదన్నారు. వేలకోట్ల దోచుకుని, ప్రాడ్ చేసి మేమేదో తప్పు చేసినట్లు మమ్మ‌ల్ని విమర్శిస్తున్నారు. కేసీఆర్ పేరు కోసం...కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. కేటీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు.. సెన్స్ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నారంలో లిఫ్ట్ చేసే నీళ్ళు కూడా లేవన్నారు.

Next Story