ఆందోళన చెందకండి.. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  18 Jan 2025 6:25 PM IST
ఆందోళన చెందకండి.. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన చివరి వ్యక్తికి అందే వరకు రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతూనే వుంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల లిస్ట్‌లలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కులగణన, సోసియా ఎకనమిక్ సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిల్లో ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభలలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తామ‌న్నారు. ఎవరు ఇప్పుడు కార్డు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు అర్హులు అందరికీ అందజేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story