ఆ రుణం కూడా త్వరలోనే మాఫీ.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్‌

రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

By అంజి  Published on  24 Aug 2024 6:59 AM IST
Minister Tummala Nageswara Rao, loan waiver, Telangana

ఆ రుణం కూడా త్వరలోనే మాఫీ.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్‌

రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కుటుంబ నిర్దారణ లేని 4,24,873 ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త యాప్‌ను తీసుకొచ్చామన్నారు. అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు.

కొన్ని చోట్ల రైతు వేదికలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉండి రైతుల ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని తెలిపారు. వివరాలు తప్పుగా నమోదైన 1,44,545 ఖాతాలకు సంబంధించి ఇప్పటికే 41,322 ఖాతాలు సరి చేశామని మంత్రి చెప్పారు. పలు బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసే మొత్తాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. మాఫీ అయిన ఖాతాలకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.

Next Story