రాహూల్ ముద్దపప్పు.. రేవంత్ గన్నేరు పప్పు : తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కు ఛాన్స్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
By Medi Samrat Published on 3 Nov 2023 6:45 PM ISTముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కు ఛాన్స్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బిఆర్ఎస్ గెలవాలన్నారు. 78 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు-ఎవరి మద్దతు అవసరం రాదని అన్నారు. భూమి విలువలో ఇండియాతోకాదు ప్రపంచంతో పోటీ పడుతున్నామని.. రక్షణ విషయంలో తెలంగాణ మినీ ఇండియా అని అభివర్ణించారు.
ప్రపంచ ప్రజల్ని అక్కున చేర్చుకున్న ప్రాంతం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన డాక్టర్ కేసీఆర్ అని కొనియాడరు. తెలంగాణ విషయంలో కేంద్రంది వివక్ష అని విమర్శించారు. రాహూల్ ముద్దపప్పు.. రేవంత్ గన్నేరు పప్పు అని ఎద్దేవా చేశారు. కర్నాటక ఐదు గంటల కరెంటా.. తెలంగాణ 24 గంటలా తేల్చుకోవాలన్నారు.
నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు చేసి చూపిస్తామన్నారు. పక్క పార్టీల వారికి 27 మందికి కాంగ్రెస్ సీట్లు ఇచ్చారని.. బీసీలకు పాతబస్తీలో సీట్లు కేటాయించారని విమర్శలు గుప్పించారు. మేమే ఏ టీం.. ఎవరికీ బీ టీం కాదు.. వాళ్లదే మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కూడా కీలక భూమిక పోషించబోతున్నామన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలు అమలు చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యామేజీ అయితే నిర్మాణ సంస్థ నుంచి రికవరీ ఉంటుందన్నారు. నష్టం జరిగితే ఒప్పందం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రెండు సీట్లు గెలవని పార్టీలు బీసీ సిఏంను చేస్తుందా? అని బీజేపీ రాష్ట్ర శాఖను ఎద్దేవా చేశారు.
ఒక్క సీటు గెలిచిన బీజేపీ బీసీ సీఎం అనడం హాస్యాస్పదం అన్నారు. షర్మిల పోటీ నుంచి తప్పుకుంటుందని తాను ఎప్పుడో చెప్పినన్నారు. కొత్తగా పార్టీలోకి చేరికలు సాధారణం.. బీఆర్ఎస్‌లో టికెట్ లేకున్నా చేరికలు ఉంటాయన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు.