హామీలు అమలు చేస్తున్నామని కడుపుమంట..బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్

తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 25 Jan 2025 11:37 AM IST

Telangana, congress, brs, minister seetakka

హామీలు అమలు చేస్తున్నామని కడుపుమంట..బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్

తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు వేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీతక్క. లబ్ధిదారులను ఆందోళనకు గురి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతామైన పదవుల్లో కొనసాగుతూ.. అలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరుతాయన్న ఆమె.. ఆ విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. నిరుపేదలు బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని మంత్రి సీతక్క అన్నారు.

రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. భూమి లేని రైతు కూలీలను అధ్వానంగా చూశారని, రూ.కోట్లు ఉన్న ఆసాములకు మాత్రం రైతు బంధు సాయం ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉన్నట్లుందని.. అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శల దాడి చేశారు.

Next Story