రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్కతో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం జరిగింది. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అధికారుల నుంచి మంత్రి సీతక్క వివరాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తాం. సర్క్యులర్ 4779 రద్దు, గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేలా సాధ్యసాధ్యాలను పరిశీలించాలి. జీతాల పెంపు, ఫిక్స్ టైమ్ స్కేల్‌పై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించాం. ఫీల్డ్ అసిస్టెంట్లు బదిలీలకు అనుమతి ఇస్తాం. శాఖ పరిధిలోని అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.