హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పెట్టుబడిపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించిన

By Medi Samrat  Published on  9 Dec 2023 1:47 PM GMT
హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పెట్టుబడిపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ వైపు వర్షాలు పడుతున్నాయని.. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో వేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్‌లకు రైతు బంధు పడలేదని బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నియామావళిని ఇష్టానుసారంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు స్కీమ్‌ విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపిన తర్వాత రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.

Next Story