ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మద్యం అనుమతులు తీసుకోవాలి : మంత్రి పొన్నం

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ఎవరు వివరించిన ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చ‌రించారు

By Medi Samrat  Published on  28 Oct 2024 9:14 AM GMT
ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మద్యం అనుమతులు తీసుకోవాలి : మంత్రి పొన్నం

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ఎవరు వివరించిన ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చ‌రించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మధ్య నిషేధం లేదు.. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆర్థికంగా దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చట్టంలో ఉన్న విధంగా ఫంక్షన్‌లు కార్యక్రమాలు చేసుకోవచ్చు.. ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రికి మంత్రులకు ఫామ్ హౌస్ లలో జరుగుతున్న కార్యక్రమాలపై అవసరం లేదు.. అక్కడ జరుగుతున్న డిస్టబెన్స్ పై ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారన్నారు. అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికింది.. కేసు రిజిస్టర్ చేశారు.. దాని తదుపరి జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్ల‌డైంది.. తరువాత నార్కోటిక్ డ్రగ్స్ కేసుగా నమోదు చేశారు.. మేము వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదన్నారు.

అక్కడ జరుగుతున్న పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు అది రాజకీయంగా కేసీఆర్ బావమరిది కావడంతో మీడియా అట్రాక్ట్ అయిందన్నారు. మేము ఎవ్వ‌రం స్పందించలేదు.. మేము స్పందిస్తలేమని స్వయంగా ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసుల మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ మాట్లాడిన తర్వాత పోలీసులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. పోలీసులు ఎటువంటి విచక్షణ వివక్ష లేకుండా దర్యాప్తు చేయాలని కోరుతున్నామ‌న్నారు.

అర్ధరాత్రి డీజే సౌండ్ పెట్టి పక్క వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. అది వీఐపీ బామ్మర్ది కావడం వల్ల మీడియా అక్కడికి వెళ్లిందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి, మంత్రుల కుట్ర ఉందని అంటున్నారు.. మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు అన్నారు. మీ కన్నా మంచిగా ఈ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల్లో ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు.

ప్రజల దృష్టి మళ్లించడానికి కక్ష సాధింపు ధోరణి అని ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉంటాయి.. జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉండవ‌న్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌ల‌లో స్వేచ్ఛగా విందు వినోదాలు చేసుకోవచ్చు.. ఎలాంటి అశ్లీలత లేకుండా మాదక ద్ర‌వ్యాలకు తావు లేకుండా మద్యపానం అనుమతులు తీసుకొని విందులు చేసుకోవచ్చన్నారు. మీరు అనుమతులు తీసుకోకుండా విదేశీ మద్యం వాడుతూ అర్ధరాత్రి డీజే సౌండ్స్ పెట్టి ఇబ్బందులు కలిగించి.. బట్ట కాల్చి మీద వేయడమేనా మీ వ్య‌వ‌హారం అని మండిప‌డ్డారు.

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇప్పుడు చిప్ప చేతికిచ్చి పోయారు.. మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసినా ఉద్యోగుల‌కు ఒకటో తారీఖు జీతం ఇవ్వలేదు. మేము ఒకటో తారీఖు జీతం ఇస్తున్నాం.. 2022 నుండి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు.. మేము డిఏ ప్రకటించాం.. గురుకుల భవనాలకు కిరాయిలు ఇవ్వలేదు.. మేము ఇచ్చాం.. హాస్పిటల్లో మీరు పెట్టిన బకాయిలకు మేము పెండింగ్ లు క్లియర్ చేసాం.. రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామ‌ని తెలిపారు.

ప్రభుత్వాన్ని బ‌ద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఎవరు ప్ర‌య‌త్నం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని బ‌ద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవు పార్టీలకు మాదకద్రవ్యాలకు అనుమతి లేదన్నారు. మేము ప్రజాహిత కార్యక్రమంలో బిజీగా ఉన్నాం.. తెలంగాణ సమాజం గమనించాలన్నారు.

ఉదయం మద్యం దొరికింది. ఎక్సైజ్ కేసు పెట్టాం. సాయంత్రం డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ కేసు పెట్టాం అన్నారు. ఈ విష‌యంలో కిషన్ రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు.. ఈటెల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

Next Story