బలహీనవర్గాల వ్యతిరేకిని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు: మంత్రి పొన్నం
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్..అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik
బలహీనవర్గాల వ్యతిరేకిని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు: మంత్రి పొన్నం
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్..అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశాలను ఇచ్చింది. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన బీజేపీ.. కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీలకు ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్‌ని అకారణంగా తొలగించి.. వేరే వాళ్ళని నియమించారు. ఇటీవల ఐదు శాసనమండలి ఖాళీలకు అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం జరిగేలా బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. మా ప్రభుత్వం ఇటీవల ముగ్గురు మంత్రులను సామాజిక న్యాయం ద్వారా కేటాయించారు...అని పొన్నం పేర్కొన్నారు.
కరుడుగట్టిన బడుగు బలహీనవర్గాల వ్యతిరేకి రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుడుని చేశారు. ముందు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. కిషన్‌రెడ్డి గారు ముందు మీ మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్‌కి, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్యలకు ఇవ్వండి. వాళ్ళకి ఈ మంత్రి పదవి ఇచ్చి తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్ తీసుకొచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే పాయల్ శంకర్ లాంటి వాళ్లు శాసనసభలో మద్దతు తెలిపితే వాళ్ల ఆటలు నడవకుండా అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మేము అడుగుతున్న దానికి బీజేపీ జవాబు చెప్పాలి. మా పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అంతర్గతంగా మేము అడుగుతాం. బలహీన వర్గాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు హిందువులు , ముస్లింల పేరు మీద డైవర్షన్ లేకుండా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్న దానిని ఆమోదింపజేయాలి. మీరు బిల్లు ఆమోదింపజేయగానే కోర్టు చెప్పిన విధంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సహకరించాలి..అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.