ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిది : మంత్రి పొన్నం

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  11 Nov 2024 2:45 PM GMT
ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిది : మంత్రి పొన్నం

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కేటీఆర్‌ కార్ రేసింగ్ కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. తనను తాను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలన్నారు. అమృత్ పథకం అక్రమాలంటూ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదన్నారు. అమృత్ పథకంలో అక్రమాలంటూ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారన్నారు.

ఫార్ములా-ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రవాణా శాఖలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 113 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారని తెలిపారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్ లో వినియోగిస్తామని వెల్ల‌డించారు.

ఢిల్లీకి వెళ్లి అమృత్ పథకం మీద ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. కారు రేసుకు సంబంధించి ఇటీవలే గవర్నర్ అనుమతి కోరామని తెలిపారు. మేము ఎవరినీ జైల్లో పెడతాం అనడం లేదు.. తనను తాను రక్షించుకునేందుకు కేటీఆర్ కేంద్రం వద్ద మోకరిల్లేందుకు వెళుతూ.. ప్రజల దృష్టిని మరల్చుతున్నారన్నారు. అమృత్ లో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు.. కానీ మీ మీద జరిగే విచారణను ఆపుకునేందుకు వెళుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఢిల్లీ పర్యటన తనపై వచ్చే ఆరోపణలు నుంచి తప్పుకునేందుకే అని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. విచారణకు సహకరించండి.. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండ‌ని కేటీఆర్‌కు సూచించారు.

Next Story