కేంద్రం నుండి హైదారాబాద్‌కు ఏం తెస్తారో చెప్పండి.? : ఇద్దరు కేంద్రమంత్రులకు పొన్నం ప్రశ్న
తెలంగాణ లో ప్రభుత్వం తరుపున ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదారాబాద్ నగరానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా 10 వేల కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కలకు హైదారాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
By Medi Samrat Published on 27 July 2024 3:05 PM ISTతెలంగాణ లో ప్రభుత్వం తరుపున ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదారాబాద్ నగరానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా 10 వేల కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కలకు హైదారాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష చూపుతూ కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ,మెట్రో వాటర్ వర్క్స్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ దాంతో పాటు హైదారాబాద్ కి కి సంబంధించి మెట్రో అభివృద్ధి చెందుతున్న అంశాలు ఆర్థిక లేమితో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నూతనంగా హైడ్రా, మూసి ప్రక్షాళన ,మెట్రో ఇతర అంశాలకు 10 వేల కోట్లు కేటాయించారన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని , గతంలో టూరిజం నుండి మంత్రిగా ఉన్నపుడు కూడా హైదరాబాద్ కోసం హెరిటేజ్ కి ఒక్క రూపాయి తీసుకురాలేదని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ వస్తె రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదారాబాద్ నుండి కరీంనగర్ కు మార్చారు. ఆనాడు కరీంనగర్ కు స్మార్టీ సిటీ అవసరం ఉందని కానీ హైదరాబాద్ కి అదనంగా స్మార్ట్ సిటీ తేవడానికి పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా నీటి వనరులను పెంచడానికి చారిత్రాత్మక హైదారాబాద్ హెరిటేజ్, టూరిజం , ఆర్కియాలజీ ద్వారా అభివృద్ధి చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదనీ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్లు ఇచ్చిందనీ కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ల రూపంలో గాని లేదా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఎన్ని నిధులు తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బడ్జెట్ సవరణ ల ద్వారా హైదారాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నిధులు తెచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలనీ పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఏస్ఆర్డిపి, ఎస్ఎన్డీపీ ద్వారా రోడ్ల నిర్మాణాలు, నాళాల పునరుద్ధరణ చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాగు నీటికి అమృత్ పథకం కింద నిధులు కేటాయించాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి వీధి వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేయాలని కోరారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి లు బడ్జెట్ చాల బాగుంది.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తున్నారు.. మీ నియోజకవర్గాలకు ఏం తెలేని వారు మీరు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా ఇవ్వని బీజేపీ నేతలు ఏం ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
మీకు చేతనైతే మీకు తెలంగాణ డీఎన్ఏ మీ రక్తంలో ఉంటే తెలంగాణ ను వ్యతిరేకించిన ప్రధాని మోడీ నీ నివేదించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు తెగలిగే సత్తువ ఉంటే రావాలని సవాలు విసిరారు. కేంద్రం నిధుల విషయంలో శాసన సభ లో తీర్మానం చేశామని అఖిలపక్షానికి నాయకత్వం వహించండనీ బీజేపీ నేతలకు సూచించారు ప్రధాన మంత్రి దగ్గర ఇంకా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో సహకరించలేదను సమన్వయం లేనందునే నిధులు ఇవ్వలేదన్న మీరు మా ముఖ్యమంత్రి మంత్రులు పార్లమెంట్ సభ్యులు అనేకే సార్లు ప్రధాని మోదీ మీ కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ ఎందుకు వివక్ష చూపించారని తెలిపారు.
తెలంగాణ విభజన హామీలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారనీ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్రం సహకారం చేసే అవకాశం ఉన్నప్పటికీ మాటలకే పరిమితం అవుతున్నారన్నారు. బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని ఇంకా సమయం మించి పోలేదు బడ్జెట్ సెషన్ లోనే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి మా ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి తమకు ఏం నాముషీ లేదనీ ఫెడరల్ సిస్టమ్‌లో అది తమ హక్కుగా భావిస్తామన్నారు.
రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ముందుకు వచ్చి నిధులు తేవడానికి సంబంధించి చొరవ చూపెట్టాలని కోరారు. కిషన్ రెడ్డి తనది బొగ్గు శాఖ అనుకున్నప్పటికి ఆ శాఖ కు సంబంధించి మినరల్ డెవలప్మెంట్, సీఎస్ఆర్ నిధుల నుండి హైదారాబాద్ కి నిధులు కేటాయించాలని సూచించారు. గంగా ప్రక్షాళనకు వందల, వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు విస్మరించిందన్నారు. మెట్రో రైల్ పాత నగరంతో పాటు, శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి నిధులు తీసుకోవాలన్నారు.
బడ్జెట్ లోని ప్రతి అంశం కేటాయింపులో బీసీ లకు భాగస్వామ్యం ఉందన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరగనిచ్చే పరిస్థితి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి మంత్రి వర్గం భావిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి ఓటర్ల లిస్ట్ రావాలి. బీసీ గణన జరగాలి దాని తరువాతనే ఎన్నికలకు పోవాలని ఎన్నికలకు జాప్యం అవుతుందన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల కమిట్మెంట్ తో ఉందన్నారు. గత ప్రభుత్వం కేంద్రంతో డిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా వ్యవహరించిందన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులకు మద్దతు తెలిపి నీతి అయోగ్ బహిష్కరించడం వల్ల పెద్ద పని చేశామని అనుకుంటే సరిపోదనీ రైతు బిల్లులకు, 370 ఆర్టికల్, జీఎస్టీ తదితర బిల్లులకు సపోర్ట్ చేసి నితి ఆయోగ్ హాజరుకనంత మాత్రానా ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం తెలియజేయడానికి ఈరోజు జరుగుతున్న నీతి అయోగ్ సమావేశానికి వెళ్ళలేదన్నారు.
తమ నిరసన చెప్పడానికి నీతి ఆయోగ్ ఒక వేదిక అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్న దగ్గర అన్యాయం జరుగుతుందని దేశ వ్యాప్తంగా నిరసన చెప్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన విహార యాత్రల జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయంలోనే నిర్మించిందనీ, అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి వస్తా అంటే తెలంగాణ వ్యతిరేకి అక్కడికి వస్తె హెలికాప్టర్ పేల్చేస్తమేనే పరిస్థితి ఆరోజు ఉండేదని గుర్తు చేశారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్ నుండి కింది వరకు నీళ్ళు తీసుకుపోయి పరిస్థితి వచ్చిందన్నారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి కట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. విహార యాత్రకు పోయినట్టు కాళేశ్వరంకు పోయి ఏం సాధించారని బీఆర్ఎస్ నేతలు తప్పులు ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తే ప్రజలు మీ పట్ల సానుకులననికి వస్తారు కావచ్చన్నారు. కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అయిందని ఆరోజే చెప్పారని, ఒక్క నీటి చుక్క వాడుకోకుండానే కాళేశ్వరం నిర్వహణ భారమైందన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ద్వారా నీరు తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వనిదన్నారు. బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని విహారయాత్రలకు వెళ్ళిన రైతాంగాన్ని కాపాడేబాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటదన్నారు. కాళేశ్వరం నుండి ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఎత్తి పోసారో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారానే మొత్తం నీళ్ళు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని.. కాళేశ్వరం నుండి తమ పొలాలకు వచ్చిన నీళ్ళు ఏం లేవని మిడ్ మానేరు మా గుండెకాయ గోదావరి ద్వారా వచ్చిన నీళ్ళు అక్కడి నుండి తీసుకుని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉందన్నారు.