వారనుకుంటున్నట్లు ఇది రీ సర్వే కాదు..జస్ట్ సమాచారం ఇవ్వడానికే: మంత్రి పొన్నం
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik
వారనుకుంటున్నట్లు ఇది రీ సర్వే కాదు..జస్ట్ సమాచారం ఇవ్వడానికే: మంత్రి పొన్నం
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు కుల గణన సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని.. కొంత మంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం మాత్రమే అని చెప్పారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలు.. అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కులగణన, బీసీ, ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి ఇష్టం లేదని మంత్రి పొన్నం ఆరోపించారు. బీజేపీ వ్యాపారస్తుల అనుకూల పార్టీ ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి. సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సామాజిక మార్పు కలిగించే నిర్ణయం ఇది అని అన్నారు. రాజకీయ విమర్శల కోసమే బీజేపీ నేతలు.. బీసీలు, ముస్లింలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీసీలక స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. బలహీన వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లును అడ్డుకోవద్దు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇది రీ సర్వే కాదు.. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం మాత్రమే. pic.twitter.com/XYMQivCTOm
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 13, 2025