ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది : మంత్రి పొంగులేటి

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By -  Medi Samrat
Published on : 10 Feb 2026 4:56 PM IST

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది : మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని.. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉందని బాంబ్ పేల్చారు. కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌లో నేను ఏం మాట్లాడానో ట్యాపింగ్ చేసి విన్నారని.. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది.. మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు.. అవి బయ‌ట‌కు ఎలా లీక్ అవుతున్నాయి.? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడని అనుమానంగా ఉందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తోందని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయటపెడతామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Next Story