పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు : మంత్రి పొంగులేటి

పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  3 Jun 2024 2:18 PM IST
పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు : మంత్రి పొంగులేటి

పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండల పర్యటనలో ఆయ‌న మాట్లాడుతూ.. అనేక కష్టాలు, నష్టాలు పడి నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. మీరిచ్చిన అవకాశంతోనే నేను ఈస్థాయిలో ఉన్నాన‌న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందన్నారు. ఆనాడు ఎన్నికల సభలో మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తా అని మాటిచ్చా.. మీరు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తాన‌న్నారు.

రాబోయే సంవత్సరంలోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామ‌న్నారు. గడిచిన పది సంవత్సరాల్లో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదు.. గత BRS ప్రభుత్వం.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామ‌ని మాటిచ్చారు. ఇరవై రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామ‌న్నారు. ప్రధాన ప్రతి పక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడుతుంది. పేదవారిని విస్మరించిన BRS పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS కు సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Next Story