నా ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చేసుకోవచ్చు : మంత్రి పొంగులేటి

హైదరాబాద్ లో హైడ్రా టీమ్ కబ్జాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ వస్తున్నారు

By Medi Samrat  Published on  23 Aug 2024 5:30 PM IST
నా ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చేసుకోవచ్చు : మంత్రి పొంగులేటి

హైదరాబాద్ లో హైడ్రా టీమ్ కబ్జాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ వస్తున్నారు. తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మునిసిపాలిటీలు, గ్రామాల్లో ఈ ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.

శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హిమయత్ సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తనకు ఫామ్ హౌస్ ఉందని అన్నారు. తన ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారులకు బదులు బీఆర్ఎస్ వాళ్లే వెళ్లి కొలవాలని, అక్రమమని తేలితే కూల్చేసుకోండన్నారు. నాది ఒకటే ఛాలెంజ్ హారైష్ రావు, కేటీఆర్ వాళ్ళ తోత్తులు ఎప్పుడు వస్తారో రండి.. రంగనాథ్ ను కూడా అదేశిస్తున్న రండి. కొత్త టేపు కొనుక్కొని రండి.. నా ఇళ్లు FTF, బఫర్ జోన్ లో ఉన్నా కూల్చేయండి. ఆ త‌ర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో డిసైడ్ చేసుకోండి. నేను అక్కడే నివసిస్తున్నానని అన్నారు. హైడ్రాను తాము ఓ మంచి ఉద్దేశంతో తెచ్చామన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు అనుమతించేది లేదన్నారు.

Next Story