ముఖ్యమంత్రిని మారుస్తారా.? మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

By Medi Samrat  Published on  2 Nov 2024 6:51 PM IST
ముఖ్యమంత్రిని మారుస్తారా.? మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై పొంగులేటి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని మార్చబోరని తెలిపారు. తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుందన్నారు. ఈ టర్మ్ రేవంత్ రెడ్డి పూర్తికాలం సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు.

త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారుడికి అందిస్తామన్నారు. తొలుత సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తామని, ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజకు కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని ఆహ్వానిస్తామన్నారు.

బీజేపీ శాసన సభ పక్షం నాయకులు మహేశ్వర్ రెడ్డి పూర్తిగా మతిలేని రెడ్డి లాగా మారిపోయిండని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమి రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ఆయనకు బీజేపీలో ఏమి పని లేక పగటి కలలు కంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ లో రోజు రోజుకు ముదిరిపోతున్న విభేదాలు.. వర్గ పోరు నుంచి దృష్గి మరల్చేందుకు ఇలాంటి జాతకాలు చెప్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ దఫా నే కాదు రాబోయే ఐదేళ్ళు అంటే పదేళ్ల పాటు సీఎం గా కొనసాగుతారన్నారు.

Next Story