రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

By -  అంజి
Published on : 5 Dec 2025 12:30 PM IST

Minister Ponguleti Srinivas Reddy, second phase, Indiramma houses, Telangana

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం

హైదరాబాద్‌: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో పల్లెలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలకు కూడా ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం, మూడు రకాల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

Next Story