మానవత్వం చాటుకున్న కేటీఆర్

Minister KTR Who Showed Humanity Shifted The Injured To The Hospital In His Vehicle. మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. చేగుంట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Medi Samrat
Published on : 16 July 2023 7:32 PM IST

మానవత్వం చాటుకున్న కేటీఆర్

మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. చేగుంట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే రూట్‌లో జ‌గిత్యాల నుంచి హైద్రాబాద్ వ‌స్తున్న‌ కేటీఆర్ వెంటనే వాహనం ఆపి.. ప్రమాదంలో గాయపడ్డ వ్య‌క్తి వద్దకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఓ డాక్టర్ గాయ‌ప‌డిన వ్య‌క్తికి ప్రథ‌మ‌చికిత్స అందిస్తున్నారు. కేటీఆర్ గాయ‌ప‌డిన వ్య‌క్తిని ప‌రామ‌ర్శించ‌డంతో పాటు.. డాక్ట‌ర్‌ను ప‌రిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ బాధితుడిని తన సొంత వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఆప‌ద‌లో స్పందించిన తీరు అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతుంది. మంత్రి చూపిన ఔదార్యానికి స్థానికులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాయ‌ప‌డిన వ్య‌క్తి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.



Next Story