త్వ‌ర‌లోనే ఆ ఐదు జిల్లాల్లో ఐటీ హ‌బ్‌లు ప్రారంభం

Minister Ktr Tweet On It Hubs In Telangana States. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం

By Medi Samrat  Published on  17 Dec 2022 3:00 PM GMT
త్వ‌ర‌లోనే ఆ ఐదు జిల్లాల్లో ఐటీ హ‌బ్‌లు ప్రారంభం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ఐదు జిల్లాల్లో ఐటీ హబ్‌లను నిర్మిస్తోంది. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లలో ఐటీ హబ్‌లు రానున్నాయని రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం తెలిపారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు ఏర్పాటై విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.

నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి దాదాపు సిద్ధమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారై నేతృత్వంలోని సంస్థలను తీసుకురావడం వంటి విష‌యాల‌లో ఎమ్మెల్యే గణేష్ బిగాల కృషిని కేటీఆర్ అభినందించారు. మహబూబ్‌నగర్ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి దాదాపు నెల రోజుల సమయం ప‌డుతుంద‌ని మంత్రి అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

సిద్దిపేట ఐటీ హబ్‌ కూడా రూపుదిద్దుకుంటోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో సిద్దిపేట హబ్‌ను ఆవిష్కరిస్తామన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో సిద్దిపేట ఐటీ హ‌బ్ చ‌క్క‌టి నిర్మాణంతో రూపుదిద్దుకుంటుంద‌ని తెలిపారు. నల్గొండ ఐటీ హబ్ నిర్మాణంలో ఉందని, నాలుగైదు నెలల్లో త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


Next Story