ఈడీ చీఫ్‌గా బండిని నియ‌మించినందుకు మోదీజీ థ్యాంక్స్ : మంత్రి కేటీఆర్‌

Minister KTR thanks to Modi for appoint bandi sanjay as ED chief.భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) పై టీఆర్ఎస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 7:20 AM GMT
ఈడీ చీఫ్‌గా బండిని నియ‌మించినందుకు మోదీజీ థ్యాంక్స్ : మంత్రి కేటీఆర్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) పై టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా మ‌రోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఈడీ విచార‌ణ త‌ప్ప‌ద‌న్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు ఈడీ చీఫ్‌గా నియ‌మించినందుకు ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా దేశాన్ని న‌డిపిస్తున్న డ‌బుల్ ఇంజిన్ మోదీ-ఈడీ అని దీనితో అర్థ‌మ‌తుతోంద‌ని వ్యాఖ్యానించారు.

ఇక రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఎత్తివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయం బాధాకరమన్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదు, విధి కూడా అని కేంద్ర మంత్రికి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Next Story