ప్రవళిక కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ బుధ‌వారం త‌న కార్యాల‌యంలో ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రవళిక కుటుంబ సభ్యులను కలిశారు.

By Medi Samrat  Published on  18 Oct 2023 2:30 PM IST
ప్రవళిక కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ బుధ‌వారం త‌న కార్యాల‌యంలో ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రవళిక కుటుంబ సభ్యులను కలిశారు. ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన కేటీఆర్‌.. వారికి ధైర్యం చెప్పారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌ని ప్ర‌వ‌ళిక తల్లిదండ్రుల‌కు హామీ ఇచ్చారు. ప్రవళిక‌ తమ్ముడికి ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవళిక చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రవళిక కుటుంబం ఈరోజు నా దగ్గరకు వచ్చింది. అమ్మాయిని ఒకడు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. న్యాయం చేస్తామని.. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటానని చెప్పిన‌ట్లు తెలిపారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కేటీఆర్ వెల్ల‌డించారు.

హిందూ, ముస్లీంల‌ మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని ఫైర్ అయ్యాకె. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని బండి సంజ‌య్‌పై ఫైర్ అయ్యారు. బండి సంజ‌య్‌ ఎంపీ అయ్యాక ఏం చేశారు.. ఓ బడి తేలేదు.. కనీసం గుడి అయినా తేలేదు.. మోదీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి.. గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్‌ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story