తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కాంగ్రెస్ దగా చేసిందన్నారు. జీవన్ రెడ్డి లాంటి నాయకులు రేవంత్ వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎరువుల దుకాణాల ముందు రైతులు చెప్పులతో లైన్ లో ఉన్నారు.. ఎండాకాలంలో సబ్ స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు చుశామన్నారు.
మూడు ఎకరాల ఉంటే.. మూడు గంటలు చాలా.. పీసీసీ ఛీప్ మాటలపై ఉత్తమ్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సన్నాసుల మాటలను వినొద్దని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ కు ఎడ్లు, వడ్లు తెల్వదు.. పబ్, క్లబ్ మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రాసిందే రాత, గీసిందే గీత.. కాంగ్రెస్ రాబందులు పార్టీ విమర్శించారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెట్టిందని అన్నారు. చిల్లర పార్టీ, చిల్లర నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు. రైతు వేదికల్లో కాంగ్రెస్ చీకటి కాలం వద్దు అంటూ తీర్మానాలు చేస్తామన్నారు.మూడు గంటల విధానం వద్దు.. మూడు పంటలు ముద్దు అని వ్యాఖ్యానించారు.