సోనూ సూద్ ను ఇబ్బంది పెడుతున్నారు : కేటీఆర్

Minister KTR About Sonu sood. సోనూసూద్.. కరోనా సమయంలోనూ ఆ తర్వాత కూడా ఎంతో మందికి సహాయం చేశారు. ఆయనను ఇప్పటికే

By Medi Samrat  Published on  8 Nov 2021 7:55 AM GMT
సోనూ సూద్ ను ఇబ్బంది పెడుతున్నారు : కేటీఆర్

సోనూసూద్.. కరోనా సమయంలోనూ ఆ తర్వాత కూడా ఎంతో మందికి సహాయం చేశారు. ఆయనను ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా విపత్తు వేళ సోనూసూద్ ప్రజలకోసం అద్భుతంగా పనిచేశారని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం చాల సులభమని.. పని చేయడమే కష్టమన్నారు కేటీఆర్. అటువంటి సమయంలో కూడా ఎంతో మందికి చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు సోనూసూద్ అని అన్నారు. సొంత డబ్బులతో ప్రజలను స్వస్థలాకు పంపించాడని.. సోనూసూద్ ప్రజలకు సేవచేసే సమయంలో కూడా అతనిని ఐటీ, ఈడీ దాడులు చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు కేటీఆర్.

హెచ్ఐసీసీలో జరిగిన కోవిడ్-19 వారియర్స్ సన్మాన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సోనూసూద్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి సోనూసూద్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో సోనూసూద్ స్పూర్తి నింపారని అన్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతో ఈడీ, ఐటీ దాడులు చేశారని, ప్రజలకు సేవలు చేద్దామని చూస్తుంటే, సోనూ మీద దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు కేటీఆర్. సోనూ సూద్‌కు మేం అండగా ఉంటామని, మీరు భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.


Next Story
Share it