గతంలో మంత్రులకు అపాయింట్‌మెంట్ కూడా ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలని పీసీసీ తెలిపారు.. నేను ఈరోజు కార్యకర్తల సమస్యలు పరిష్కరించడానికి వచ్చానని తెలిపారు. మంచి సంప్రదాయానికి నాంది పలికారు..ఇది కొనసాగాలని అన్నారు.
ప్రపంచంలోనే ఎక్కడ లేదు.. ఇండియాలోనే కులవివక్ష ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు.. కుల వివక్షని పోగొట్టడానికే కులగణన సర్వే అన్నారు. కులగణనతో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడుతుందన్నారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ కి ఏం పని అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం తెలియాలంటే దేశంలో కుల గణన చెయ్యండని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలుకుల గణన పత్రంతో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళండి.. అప్పుడు ఆయనే చెప్తాడు తన కులం అని కౌంటర్ ఇచ్చారు. కొన్ని వర్గాలకే న్యాయం చేసే పార్టీ బీజేపీ.. మతతత్వ రాజకీయాలు చేయడమే బీజేపీ పని అని విమర్శించారు.