ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి కౌంట‌ర్‌

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

By Medi Samrat
Published on : 31 July 2025 7:45 PM IST

ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి కౌంట‌ర్‌

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తుందన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలన్నారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

అయితే పార్టీ ఫిరాయింపుల‌పై మాట్లాడే నైతిక అర్హ‌త బీఆర్ఎస్‌కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉప ఎన్నికలు వస్తే వందశాతం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, బీఆర్ఎస్ గతంలో 25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, కేటీఆర్ ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడన్నారు. ఇతర పార్టీల నుండి గెలిచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌లో చేరితే మంత్రి పదవులు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

Next Story