కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచాడు : మంత్రి జూపల్లి

కేసీఆర్ కృష్ణా నది జలాలపైన ఉద్యమం చేస్తాన‌నడం హాస్యాస్పదం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  7 Feb 2024 1:00 PM GMT
కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచాడు : మంత్రి జూపల్లి

కేసీఆర్ కృష్ణా నది జలాలపైన ఉద్యమం చేస్తాన‌నడం హాస్యాస్పదం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచాడని విమ‌ర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కొత్త తెర లేపాడని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్ లో 811 టీఎంసీ నీటి నిల్వ ఉంది. కానీ తెలంగాణకు చెందిన వాటా దక్కట్లేదు.. ఆ రోజు కేసీఆర్ పట్టించుకోలేదు.. ఏపీలో జగన్ ప్రభుత్వానికి వత్తాసు కేసీఆర్ పలికిండు.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68% ఉంది.. ఆంధ్ర‌ప్రదేశ్ 32% ఉంది.. దానికి అనుగుణంగా కేఆర్ఎంబీ ఏర్పడింది.

2011లో కేఆర్ఎంబీ పరిధిలోకి వొస్తుందని చెప్పింది.. ఆరోజు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. నీటి హక్కుల కోసం కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల‌లో ఏనాడు కొట్లాడలేదన్నారు. ముడుపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. ఉద్యమం చేయాల్సినప్పుడు చెయ్యలేదు.. ఇప్పుడు ఉద్యమం చేస్తా అంటుండు కేసీఆర్ అని దుయ్య‌బ‌ట్టారు. పునర్విభజన చట్టం లోపభూఇష్టంగా ఉన్నదని ఏనాడు కేంద్రం తో కొట్లాడలేదన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టును అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. అప్పజెప్పుతామని ఎప్పుడు మేము చెప్పలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమ‌ర్శించారు.

Next Story