ఆరోపణలు కాదు.. లక్ష్మిపల్లి చౌరస్తాకు రా.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స‌వాల్‌

నిన్న వనపర్తి లో జరిగిన ఘటనను మేము ఖండిస్తున్నాం. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఎలా మాట్లాడుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on  24 May 2024 12:53 PM IST
ఆరోపణలు కాదు.. లక్ష్మిపల్లి చౌరస్తాకు రా.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స‌వాల్‌

నిన్న వనపర్తి లో జరిగిన ఘటనను మేము ఖండిస్తున్నాం. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఎలా మాట్లాడుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్ర‌శ్నించారు. గాంధీ భవన్ లో ఆయ‌న మాట్లాడుతూ.. పూర్తి వివరాలు తెలియకుండా నిన్న జరిగిన హత్య కేసులో నా హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. శ్రీధ‌ర్ రెడ్డికి రాజకీయాలకు సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యేకు ఆయన చుట్టం అని.. ఆ ప్రాంతంలో శ్రీధ‌ర్ రెడ్డి వలన చాలా కుటుంబాలు బాధ‌ పడ్డాయన్నారు. శ్రీధ‌ర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి. శ్రీధ‌ర్ రెడ్డి హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామన్నారు.

నేను బీఆర్ఎస్‌ పార్టీ మారిన నుండి నాపై ఆ పార్టీ నేతలు కక్ష పెట్టుకున్నారు. అందుకే నాపై వాళ్ళ పేపర్ లో తప్పుడు వార్తలు రాశారన్నారు. గతంలో మా నియోజక వర్గంలో ఒక రాజకీయ హత్య జరిగిందని అని నాపై ఆరోపించారు. దానికి నాకు ఏమి సంబంధం.. గతంలో జరిగిన హత్య కూడా భూ పంచాయతీ వలన జరిగిందన్నారు. అవగాహన లేకుండా మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, నన్ను భర్తరఫ్ చేసినందుకు మిమ్మల్ని జనాలు భర్తరఫ్ చేశారన్నారు. నన్ను ప్రశ్నించే అర్హత కేటీఆర్ కు లేదు.. నేరెళ్ళ ఘటన లో దళితులను హింసించిన వాళ్ళకు నాపై మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అంశాలు లేక ఇలాంటి ఫాల్స్ అలిగేశన్స్ మాపై చేస్తున్నారని అన్నారు.

గండ్ర పల్లి హత్య విషయంలో నాపై ఆరోపణలు చేశారు. అందులో నా పాత్ర లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. హత్య జరిగినప్పుడు నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు నా ప్రమేయం లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. కనుక మీరు ఇప్పుడు క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ ల‌కు సంస్కారం ఉండాలి.. నిజాయితీగా మాట్లాడాలని సూచించారు. లక్ష్మి పల్లి హత్య ఘటన జ్యుడీషియల్ విచారణ చేపట్టండి.. నాకు ఏమి ఇబ్బంది లేదన్నారు. గండ్రపల్లిలో, లక్ష్మి పల్లిలో జరిగిన రెండు హత్యలపై అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళండి.. జనాలు చెపుతారన్నారు. నాపై ఇంకొక సారి తప్పుడు ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదని హెచ్చ‌రించారు.

ఆరోపణలు కాదు లక్ష్మిపల్లి చౌరస్తాకు రా జనాలు ఏమి చెపితే అది చేద్దాము.. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మీరు ఇద్దరు లక్ష్మి పల్లికి రండి నేను వస్తానని స‌వాల్ విసిరారు. బెకూఫ్ మాటలు మాట్లాడకండి.. నాపై బురద చల్లాలని చూస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే డిఫమేషన్ కేసులు వేస్తానని హెచ్చ‌రించారు.

Next Story