నల్గొండ జిల్లాలో ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటన జరిగిన విషయం తెలియగానే మంత్రి హరీశ్ రావు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు మంత్రికి వివరించారు. గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, బాగా చూసుకోవాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9.30 గంటలకు పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కళాశాల బస్సులో సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.