జగ్గారెడ్డి ఎక్కడున్నాడో తెలియట్లేదు : హరీశ్ రావు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.

By Medi Samrat  Published on  16 Sept 2023 9:30 PM IST
జగ్గారెడ్డి ఎక్కడున్నాడో తెలియట్లేదు : హరీశ్ రావు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేడని, ఎక్కడున్నాడో కూడా తెలియదని అన్నారు. ఆయన ఫోన్ నంబర్ ఏంటో నియోజకవర్గం ప్రజలకు తెలియదని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గొప్పలు చెప్పుకుంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ ది చేతల ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ పక్కా హిందువు అయినప్పటికీ, మతాలకు అతీతంగా పని చేస్తారని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.

సెప్టెంబర్ 16న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ, ఎంబీసీలకు, మైనార్టీలకు మంత్రి హరీష్ రావు చెక్కులను పంపిణీ చేశారు. జీఓ 58, 59 పట్టాల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు అందజేశారు. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ఏ ఇతర రాష్ట్రాలు కేటాయించని విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓట్లను లూఠీ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. త్వరలోనే మెట్రో రైలు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు విస్తరణ జరగబోతుందని చెప్పారు.

Next Story