ఆ లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు
Minister Harish Rao. ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు
By Medi Samrat Published on 11 Dec 2022 7:15 PM ISTప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి. అన్ని సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చుకున్నాము. అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దు. అక్కడే మంచి వైద్యం అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకున్నాము. టిఫాతో పాటు అన్ని రకాల పరీక్షలు, గర్భిణులకు ఆసుపత్రుల్లో అందేలా చూడాలి. ప్రైవేటుకు వెళ్లి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా చూడాలి.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ సోమవారం ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు సమావేశమై ఇన్ ఫెక్షన్ కంట్రోల్ పై సమీక్ష జరపాలి. అవరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ ను, నర్సును గుర్తించి వారికి నిమ్స్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతీ హస్పిటల్ లో ఇన్భెక్షన్ సమస్యలు రాకుండా పకడ్బందిగా పని చేయాలి. అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ పంపించడం జరిగింది. సద్వినియోగం చేసుకోవాలి. ఎయిర్ చెకింగ్ తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు. డిచ్ఛార్జ్ సమయంలో వైద్యులు రాసిన మందులు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే పంపాలి. రోగులు డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఆసుపత్రిలో మూడు నెలల బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. దీనిపైన ఆర్.ఎం.వోలు, సూపరిడెంట్లు ప్రత్యేక శ్రద్ద వహించాలి. అన్ని వేళల్లో అవసరమైన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.