భయపడే ముచ్చటే లేదు.. ఇలాంటివి కేసీఆర్ చాలా చూసారు
Minister Errabelli Dayakar Rao Fire On BJP. తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మను ఎవరు పట్టించుకోని సమయంలో
By Medi Samrat
తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మను ఎవరు పట్టించుకోని సమయంలో కవిత ఒక గుర్తింపు తెచ్చారని.. అలాంటి కవితపై దాడిని ఖండిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ ది మచ్చలేని కుటుంబం.. ఎన్ని ఆశలు పెట్టిన కూడా ప్రాణాలకు తెగించి కోట్లాడి తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. విభజన హామీలు కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మీ కేసులకు భయపడే ముచ్చటే లేదని.. ఇలాంటివి కేసీఆర్ చాలా చూసారని అన్నారు. మీకు కార్యకర్తలు లేకనే బౌన్సర్లను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
మీ నాయకులు కవిత ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్చందంగా వచ్చి బండి సంజయ్ యాత్రను అడ్డుకున్నారని అన్నారు. నిన్ను కుక్కలు కూడా దేకుతలేవని ఇలాంటివి సృష్టిస్తున్నావని బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టమని మోదీ బండి సంజయ్ కి చెప్పారని ఆరోపించారు.
ఒక గుజరాత్ వ్యక్తి బూట్లు మోసిన బండి సంజయ్.. నీకు సిగ్గుందా అనితీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెడుతామన్న మీరు.. రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మీరు బయపట్టిస్తే భయపడడానికి ఇక్కడ సిద్దంగా ఎవరూ లేరని అన్నారు. మునుగోడు ప్రజలు మీకు బుద్ధి చెప్తారని అన్నారు. నువ్వు నమ్మిన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు.. దేవురుప్పుల లో దాడి చేసింది మీరు కాదా..? అని అడిగారు. కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు.