సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు
మేదరమెట్ల సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 10 March 2024 7:30 PM IST
మేదరమెట్ల సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మొనగాడు, చంద్రబాబు మోసగాడని.. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని అన్నారు. సింగిల్ గా వస్తే చితకబాదుతాం, ఇద్దరూ కలిసి వస్తే విసిరికొడతాం, ముగ్గురుగా వస్తే సముద్రంలో కలిపేస్తామని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదని.. చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేశారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని అన్నారు. సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారని.. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారన్నారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారని వివరించారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం.. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారని చెవిరెడ్డి ప్రసంగించారు.